Tuesday, 3 September 2013

అలవాటు లేని సంస్కారాన్ని అలవరుచుకోలేరు

రాజేసిన తరువాత
రేగిన మంటలు 
రోజులు
వారాలు దాటి 
మాసం దగ్గరికి వస్తోంది
జరిగింది మోసం అనే 
నమ్మకం సడలడం లేదు
సంస్కార రాజకీయ నాయకులు
సుదూరంగా నైనా కానరావడం లేదు 
జాతీయంగా చూసినా 
ఆ జాడే కనిపించడం లేదు
అంతో ఇంతో 
సంస్కారం వున్న నాయకులను 
స్వార్థపు ప్రజలు 
పట్టించుకోనంత కాలం 
ఫలితాలు ఇలానే వుంటాయి
స్వార్థపు జనం కోసం   
వీళ్లు నమ్మే నాయకులు  
కొత్తగా 
తమకు అలవాటు లేని 
సంస్కారాన్ని 
అలవరుచుకోలేరు

1 Comment:

దేవరింటి హేమ కుమార్ said...

జై సమైక్యాంద్ర
జై జై సమైక్యాంద్ర
రా కదలి రా

అనంత సాగరమై అనంతపురం నుంచి
కణకణ మండే నిప్పు కణమై కర్నూలు నుంచి
కొండంత బలం తో కడప నుంచి
చింత నిప్పుల వలె చిత్తూరు నుంచి
నిశబ్దంగా నెల్లూరు నుంచి
ప్రకాశవంతంగా ప్రకాశం నుంచి
గుణపాఠంలా గుంటూరు నుంచి
కృష్ణమ్మ దీవెనతో కృష్ణా నుంచి
తూఫానులా తూర్పు గోదావరి నుంచి
ప్రళయ గోదావరిలా పక్షిమగోదావరి నుంచి
విశాలాంద్రకై విశాఖ నుంచి
విజయం కోసం విజయ నగరం నుంచి
శివాలెత్తి సిక్కోలు నుంచి
రా కదలి రా
జై సమైక్యాంద్ర
జై జై సమైక్యాంద్ర




Post a Comment