Friday, 30 August 2013

ఏడుపులోనూ నవ్వుకోండి

ఉల్లి ధర కన్నీళ్లు తెప్పిస్తోంది. ఉల్లిపాయ లేకుండా కూరలు ఎలా వండాలో తెలియక గృహిణులు బిక్కమొహం వేస్తుంటే... హోటళ్లు, రెస్టారెంట్లలో సైతం 'నో ఆనియన్ ప్లీజ్' అనే బోర్డులు కనిపిస్తున్నాయి. ఉల్లి కోసం తల్లడిల్లుతున్న వీరి కడుపుమంట సోషల్ నెట్‌వర్క్‌లో నవ్వులపూలు పూయిస్తోంది. ఆకాశన్నంటిన ఉల్లి ధరపై ఫేస్‌బుక్‌లో, ట్విటర్లో, ఎస్ఎంఎస్‌ల ద్వారా నెటిజన్లు వేస్తున్న జోకులు లెక్కలేనన్ని... ఈ కష్టకాలంలో కనీసం వాటిని చదివి కాసేపు నవ్వుకుందాం...
- రానున్న కాలంలో కింది వాటిలో ఏది 100 రూపాయలు దాటుతుందో చెప్పండి?

ఎ) రూపాయి బి) పెట్రోల్ సి) ఉల్లిపాయలు
- దబాంగ్‌లో సోనాక్షి డైలాగ్ ఇది. తప్పడ్ సే దర్ద్ నహీ లగ్తా సాబ్... ప్యార్ సే లగ్తా హై (చెంపదెబ్బతో నొప్పి కలగదు... ప్రేమతో కలుగుతుంది ) దీనికి పేరడీగా వచ్చిన డైలాగ్... తప్పడ్ సే దర్ద్ నహీ లగ్తా సాబ్... ప్యాజ్ సే లగ్తా హై (చెంపదెబ్బతో నొప్పి రాదు... ఉల్లిపాయతో వస్తుంది)
- డైమండ్ రింగ్స్ కన్నా ఆనియన్ రింగ్స్ ఖరీదయ్యేలా కనిపిస్తోంది.
- ఒక కార్టూన్‌లో... మార్కెట్లో కిలో ఉల్లిపాయలు కొంటున్న కుర్రాడిని చూస్తూ దంపతులు ఇలా ముచ్చటించుకుంటున్నారు. 'మన అమ్మాయికి తగిన వరుడితనే...'
- మరో కార్టూన్‌లో మూడు కిలోల ఉల్లిపాయలు కొనేందుకు వచ్చిన మహిళతో షాపువాడు ఇలా అంటున్నాడు ' మేడమ్ మీ పాన్ కార్డ్ ప్లీజ్...'
- 'రోటీ కప్‌డా ఔర్ మకాన్' పాత సినిమా టైటిల్.... కొత్త టైటిల్ 'ఆనియన్ కప్‌డా ఔర్ మకాన్'
- రాజకీయ నాయకులు తమ స్విస్ బ్యాంక్ అకౌంట్లో డబ్బు సంచులను కుమ్మరించడం బదులుగా ఉల్లి సంచులను కుమ్మరిస్తున్నట్టుగా వేసిన బొమ్మ నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
- ప్రముఖ బాలీవుడ్ విమర్శకుడు తరుణ్ ఆదర్శ్ ఉల్లి 100 రూపాయలు దాటితే అది తప్పకుండా 'సూపర్ హిట్' అని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.

0 Comments:

Post a Comment