Monday, 29 July 2013

క చ రా గారికి విన్నపము

మీకు మాత్రం వినిపిస్తున్న సిగ్నల్స్
తెలంగాణా వాదులక విన్పించక
మార్చ్ పెట్టుకొంటే
ఆ గలాభా తో
ఫాం హౌస్ లో ప్రశాంతం గా
వుండలేక
మీరు హస్తిన బాట పట్టారు
వాయిలార్ తో మీ వాగుడు వికటించే కొద్ది
ఫెర్నాండజ్ తో పెట్టుకొన్నారు
అబ్బాయిని బొత్స దగ్గరికి పంపి
ఆయనను బయపెట్టిస్తున్నారు
ఎప్పుడో మీరు కాంగ్రెస్ ని
బొంద పెట్టేస్తాం అని అన్నట్టు గుర్తు
ఇప్పుడు ఆ పని ఆపి
బొట్టు పెట్టి పిలవక పోయినా
వెళ్లి బతిమాల్తూ
వాదాన్ని ‘చేతి’ పాదం ముందు
పణంగా పెట్టి
అఖిల పక్షం సమావేశం లాంటి
కోరికల మీద పెట్రేగి పోతున్నారు
అలసి పోయి వుంటే
ఉద్యమాన్ని చేసే వాళ్లకు ఇవ్వండి
దాన్ని నీ హక్కుగా పెట్టుకొని
పెద్దల దగ్గర పరపతి పెంచుకొని
ఓ చెన్నా రెడ్డో
చిరంజీవో అవ్వకు
జాతి అసహ్యించుకొంటాది

courtesy:chaakirevu.wordpress.com

0 Comments:

Post a Comment