Wednesday, 19 June 2013

రాజన్న రాజ్యాన్ని స్వాగతిద్దాం.!

మొగుడు 
కొడుకు లు 
దోచుకొచ్చినప్పుడు 
దిష్టి తీసి న తల్లి 
జైల్లో పెట్టగనే 
కుట్రన్న తల్లి
కన్న కొడుకు 
అనుభవిస్తున్న 
జైలు భోగాల గురించి 
ఎవరు మాట్టాడినా 
వాళ్ళ మీద భౌతిక దాడులు చెయ్యమనే 
దాష్టీకపు ఆలోచనలను 
అమలు చెయ్యమని 
జైల్లో తీర్థం పుచ్చుకొచ్చిన 
పుణ్యాత్ములకు 
పురమాయించిందట
గతం లో 
అరెస్ట్ చేసి చూడండి 
లక్ష చేతులు లేస్తాయి అన్నారు 
జైలు గోడలు బద్డ్దలు కొట్టైనా 
బయటకు తెస్తాం అన్నారు
ఇటువంటి వీళ్ళు 
ప్రజాస్వామ్యం గురించి 
పత్రికా స్వేచ్చ గురించి 
ప్రజల గురించి 
తమ మెదళ్ళు వాచే లా 
ఆలోచిస్తుంటారు 
న్యాయ వ్యవస్థ గురించే 
అర్థం చేసుకోలేని అవస్థ వీల్లది
ఇట్టాంటి వీళ్ళను 
చట్టాలు చెయ్యడానికి పంపించి 
స్వాగతిద్దాం  

courtesy: http://chaakirevu.wordpress.com.

0 Comments:

Post a Comment